పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకదిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన 'బాహుబలి' చిత్రాలు భారతీయ సినీ పరిశ్రమ ఘనతను తార స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా టాలీవుడ్ సత్తాను ఈ సినిమాలు విశ్వవ్యాప్తం చేశాయి. తాజాగా 'బాహుబలి-1' సినిమా అంతర్జాతీయంగా మరో ఘనతను సాధించింది. 'బాహుబలి-1' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 650 కోట్లకు పైగా వసూలు చేసి ప్రభంజనం సృష్టించింది. తాజాగా నెట్ ఫ్లిక్స్ వేదికగా ఇప్పుడు స్పానిష్ భాషలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్పానిష్ భాషలో ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను అంతర్జాతీయ మాధ్యమాల్లో మరింతగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలని నెట్ ఫ్లిక్స్ భావిస్తోంది. ఈ చిత్రంలో అనుష్క, తమన్నా, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, కిచ్చా సుదీప్ తదితరులు ప్రధాన ప్రాత్రలు పోషించారు. ఎం.ఎం కీరవాణి సంగీతం అందించారు. ఆర్కా మీడియా వర్క్ ఈ చిత్రాన్ని నిర్మించింది. 2015 జులై 10 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూ. 180 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం... అఖండ విజయాన్ని సాధించి రూ. 650 కోట్లకు పైగా వసూలు చేసింది.