పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన స్కూల్ ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్ళకు స్వల్ప గాయాలు అయ్యాయి. అంతేకాకుండా.. ప్రమాదం జరిగిన సమయంలో ఎక్కువ మొత్తంలో పొగ పీల్చడం వల్ల కొంత అనారోగ్యంకి గురయ్యాడు. గత నాలుగు రోజులుగా సింగపూర్‌లో చికిత్స పొందిన మార్క్ శంకర్ కోలుకున్నట్టు తెలుస్తుంది. అందుకే చిన్న కుమారుడు మార్క్ శంకర్‌తో కలిసి సింగపూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు పవన్ దంపతులు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. కొడుకు ఆరోగ్యం కుదుటపడిన నేపథ్యంలో క తనయుడితో కలిసి పవన్ కల్యాణ్ స్వదేశానికి చేరుకోగా, నేడు భార్య అన్నా లెజ్నొవాతో తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు. అగ్నిప్రమాదం నుంచి తన కుమారుడు క్షేమంగా బయటపడిన నేపథ్యంలో శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. . సోమవారం తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకొని ఆ తర్వాత స్వామి వారి సేవలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్ దంపతులు. ఇక తన కుమారుడు క్షేమంగా బయటపడాలని ప్రార్ధించిన ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ పేరుపేరున ధన్యవాదలు తెలియజేశారు.