tamilnadu epaper

అతి పిన్న వయసులోనే ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

అతి పిన్న వయసులోనే  ఐపీఎల్‌లో  చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌తోనే రికార్డులకెక్కాడు. అతి పిన్న వయసులోనే అంటే.. 14 సంవత్సరాల 23 రోజుల్లోనే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు ప్రయాస్ రే బర్మన్ పేరిట ఉంది. బర్మన్ 16 సంవత్సరాల 157 రోజుల వయసులో ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడాడు. ఇప్పుడా రికార్డును సూర్యవంశీ తుడిచిపెట్టేశాడు. బర్మన్ 2019లో బెంగళూరుకు ఆడాడు.  
గత రాత్రి లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌తో వైభవ్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. తుది జట్టులో చోటు దక్కకున్నా ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు దిగాడు. తొలి బంతినే సిక్సర్ కొట్టి శభాష్ అనిపించాడు. మొత్తంగా 20 బంతులు ఆడిన సూర్యవంశీ 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. బీహార్‌కు చెందిన సూర్యవంశీని గతేడాది నిర్వహించిన ఐపీఎల్ మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రూ. 1.10  కోట్లకు దక్కించుకుంది. ఫలితంగా వేలంలో అమ్ముడుపోయిన అతి పిన్న వయస్కుడిగానూ రికార్డులకెక్కాడు.