శంషాబాద్ : శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలో ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. ఎయిర్‌పోర్టులో ఇప్పటివరకు పురుషుల కమాండోలను బందోబస్తులో ఉంచగా తాజాగా శనివారం నుంచి వారితో పాటు ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా మహిళ కమాండోలను బందోబస్తులో ఉంచినట్లు తెలిపారు. ఎయిర్‌పోర్టులో వివిధ రకాల సవాళ్లను ఎదుర్కోందుకు వీలుగా నాలుగు వారాల పాటు శిక్షణ ఇచ్చిన 15 మంది మహిళా కమాండోలను నియమించినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి.