tamilnadu epaper

నేడు 16,347 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీని విడుదల

నేడు 16,347 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీని విడుదల

ఏపీ విద్యాశాఖ నేడు 16,347 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీని విడుదల చేయనుంది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్ నిన్న ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ కల సాకారం అవుతోందని, మ్యానిఫెస్టోలో ఇచ్చిన కీలక హామీని నెరవేరుస్తూ 16,347 ఉపాధ్యాయ పోస్టులకు ఆదివారం ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. మెగా డీఎస్సీలో భాగంగా ప్రభుత్వం భర్తీ చేయనున్న 16,347 పోస్టుల్లో జిల్లా స్థాయిలో 14,088 పోస్టులు, రాష్ట్ర, జోనల్ స్థాయిలో 2,259 పోస్టులు ఉన్నాయి.  
నేటి నుంచి మే 15 వరకు ఆన్‌లైన్ ద్వారా ఫీజుల చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. మే 20 నుంచి నమూనా పరీక్షలు నిర్వహిస్తారు. మే 30 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 6 నుంచి జులై 6 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత రెండో రోజున ప్రాథమిక ‘కీ’ విడుదల చేస్తారు. ఆ తర్వాత వారం రోజులపాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆ తర్వాత ఏడు రోజులకు ఫైనల్ ‘కీ’ విడుదల చేస్తారు. అనంతరం వారం రోజులకు మెరిట్ జాబితా విడుదల చేస్తారు.