tamilnadu epaper

అద్భుతమైన హాఫ్‌ సెంచరీతో కరుణ్‌ నాయర్‌

అద్భుతమైన హాఫ్‌ సెంచరీతో  కరుణ్‌ నాయర్‌

టీమిండియా మాజీ ఆటగాడు కరుణ్‌ నాయర్‌ దాదాపుగా మూడేళ్ల తర్వాత ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చారు. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 1076 రోజుల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన హాఫ్‌ సెంచరీతో అలరించాడు.  టీమిండియా మాజీ ఆటగాడు కరుణ్‌ నాయర్‌ దాదాపుగా మూడేళ్ల తర్వాత ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చారు. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 1076 రోజుల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన హాఫ్‌ సెంచరీతో అలరించాడు. ఈ మ్యాచ్‌ల కరుణ్‌ నాయర్‌ 89 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. 33 ఏళ్ల బ్యాట్స్‌మన్ 22 బంతుల్లో తన ఐపీఎల్ కెరీర్‌లో 11వ హాఫ్ సెంచరీని సాధించాడు. ఆరు సంవత్సరాల తర్వాత ఈ టోర్నమెంట్‌లో కరుణ్ నాయర్ అర్ధ సెంచరీ చేయడం విశేషం. ఇటీవల ఫుల్‌ ఫామ్‌లో ఉన్న కరుణ్‌ 40 బంతుల్లో 12 ఫోర్లు, ఐదు భారీ సిక్సర్ల సహాయంతో 89 పరుగులు చేశాడు. 222.50 స్ట్రయిక్‌ రేట్‌తో పరుగులు చేయడం విశేషం. ఐపీఎల్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన బ్యాట్స్‌మెన్‌ సాధించిన రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. గత సీజన్‌లో లక్నోపై 68 పరుగులు చేసిన రోహిత్‌ శర్మను వెనక్కి నెట్టి రెండోస్థానానికి చేరుకున్నాడు. ఇక ఈ జాబితాలో జోస్‌ బట్లర్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున గతేడాది కోల్‌కతాపై జోస్‌ బట్లర్‌ అజేయంగా 107 నాటౌట్‌గా నిలిచాడు.