ఐపీఎల్‌లో హైదరాబాదీ ఫిక్సింగ్ కలకలం రేపింది. సాఫీగా సాగుతున్న లీగ్‌లో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. హైదరాబాద్: ఐపీఎల్‌లో హైదరాబాదీ ఫిక్సింగ్ కలకలం రేపింది. సాఫీగా సాగుతున్న లీగ్‌లో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఐపీఎల్ ఫ్రాంచైజీ యాజమాన్యాలను, ప్లేయర్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, వ్యాఖ్యాతలను అలర్ట్ చేసింది. హైదరాబాద్‌కు చెందిన సదరు వ్యాపారికి పంటర్లు, బుకీలతో దగ్గరి సంబంధాలు ఉండటంతో పాటు గతంలోనూ ఫిక్సింగ్ చేసిన చరిత్ర ఉన్నట్లు యాంటీ కరప్షన్ సెక్యూరిటీ యూనిటీ(ఏసీఎస్‌యూ) గుర్తించింది. ఖరీదైన బహుమతులకు తోడు బంగారు అభరణాలను ఎరగా వేస్తూ ఫిక్సింగ్ చేసే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అభిమానిగా చెలామణి అవుతూ ప్లేయర్లు బస చేసే హోటల్స్‌తో పాటు ప్రత్యేక కార్యక్రమాలకు ఆహ్వానిస్తూ ఫిక్సింగ్‌కు పాల్పడేందుకు ప్రణాళికలు చేసినట్లు సమాచారం.