తమిళనాడు గవర్నర్ రవి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ‘జై శ్రీరామ్’ నినాదాలు చేయాలని కోరినట్లు తెలుస్తున్నది. దీంతో ఆయనను పదవి నుంచి తొలగించాలని తమిళనాడు కామన్ స్కూల్ సిస్టమ్ వేదిక డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు చేత వాతలు పెట్టించుకున్న తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేశాక, గవర్నర్ రవి ఇలాంటి స్టంట్లు చేస్తున్నారని కాంగ్రెస్ నేత శశికాంత్ ఎక్స్ పోస్ట్‌లో దుయ్యబట్టారు. ‘నా ఎజెండాను ఇతర మార్గాల్లో అమలు చేస్తాను’ అనే సందేశాన్ని రవి ఇస్తున్నారని ఆయన అన్నారు.