tamilnadu epaper

తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అన్నా కొణిదెల

 తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అన్నా కొణిదెల

ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి అన్నా కొణిదెల ఆదివారం తిరుమల వేంకటేశ్వరస్వామికి ఆదివారం తలనీలాలు సమర్పించారు. సింగపూర్‌ నుంచి కొడుకు మార్క్‌ శంకర్‌, భర్త పవన్‌ కల్యాణ్‌తో కలిసి శనివారం భారత్‌కు చేరుకున్న విషయం తెలిసింది. ఆదివారం అన్నా తిరుమలకు చేరుకున్నారు.  ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి అన్నా కొణిదెల ఆదివారం తిరుమల వేంకటేశ్వరస్వామికి ఆదివారం తలనీలాలు సమర్పించారు. సింగపూర్‌ నుంచి కొడుకు మార్క్‌ శంకర్‌, భర్త పవన్‌ కల్యాణ్‌తో కలిసి శనివారం హైదరాబాద్‌ చేరుకున్న విషయం తెలిసిందే. ఆదివారం అన్నా తిరుమల పర్యటనకు వెళ్లారు. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆమె.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు. గాయత్రి నిలయం వద్ద ఆమెకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అక్కడే టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం శ్రీవారి తలనీలాలు సమర్పించుకున్నారు. అంతకు ముందు వరాహ స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వరాహ స్వామి వారి దర్శనం అనంతరం పద్మావతి కల్యాణ కట్టకు చేరుకున్నారు. అక్కడ భక్తులందరితోపాటు తలనీలాలు సమర్పించారు.