tamilnadu epaper

సంగారెడ్డి జిల్లాలో మరోసారి చిరుత కలకలం

సంగారెడ్డి జిల్లాలో మరోసారి చిరుత  కలకలం

సంగారెడ్డి జిల్లాలో మరోసారి చిరుత హడలెత్తించింది. టైగర్ ఉందని తెలియడంతో ఇక్రిశాట్ ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చిరుతను పట్టుకోవడానికి బోన్లు, ట్రాప్ కెమెరాలను అటవీ శాఖ అధికారులు బిగించారు. దీంతో అటువైపు వచ్చిన చిరుత ఎట్టకేలకు బోనుకు చిక్కింది. సంగారెడ్డి జిల్లాలోని ఆర్సీపురం ఇక్రిశాట్‌లో చిరుత కలకలం సృష్టించింది. చిరుత ఆనవాళ్లు కనపడటంతో అటవీశాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేశారు. ట్రాప్ కెమెరాల ద్వారా చిరుత ఆనవాళ్లను అధికారులు గుర్తించారు. ఇవాళ (గురువారం) తెల్లవారుజామున బోనులో చిరుత పడింది. చిరుత బోనుకు చిక్కడంతో ఇక్రిశాట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. గత రెండు రోజులుగా చిరుత ఉందని తెలియడంతో ఇక్రిశాట్ ఉద్యోగులు భయాందోళనలో ఉన్నారు.  చిరుతను పట్టుకోవడానికి బోన్లు, ట్రాప్ కెమెరాలను అటవీ శాఖ అధికారులు బిగించారు. చిరుత కోసం ఏర్పాటు చేసిన బోన్ల వద్ద రెండు మేకలను అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. వాటిని వేటాడానికి చిరుత వచ్చి అక్కడ ఉన్న బోనుకు చిక్కింది. చిరుత పట్టుబడటంతో ఎట్టకేలకు అటవీ శాఖ అధికారుల శ్రమ ఫలించింది. పట్టుబడిన చిరుతను హైదరాబాద్ జూ పార్క్‌కు అటవీ శాఖ అధికారులు తరలించారు. గతంలో రెండుసార్లు సంగారెడ్డి జిల్లాలో చిరుతలను అధికారులు బంధించిన విషయం తెలిసిందే.